అవనిగడ్డ: విద్యాసంస్థలు ఆదర్శనీయంగా నిలిచాయి: ఎమ్మెల్యే
వరద బాధితులను ఆదుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఆదర్శనీయంగా నిలిచాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల అభినందన సభ నిర్వహించారు. ఇటీవల కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో దాదాపు రూ. 30 లక్షలు సమీకరించి ఇచ్చిన విద్యా సంస్థల ప్రతినిధులకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలు అందజేశారు.