భారత యువ సంచలన బ్యాటర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు (34) బాదిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2014లో న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ బ్రెండన్ మెక్కల్లమ్ (33 సిక్స్‌లు) బాదగా ఇప్పుడు ఆ రికార్డును జైస్వాల్ బ్రేక్ చేశాడు. ఇక, ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక్క వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. లీడ్ 218 పరుగులు.