ఉపాధ్యాయ ఎంపిక 2024 కోసం అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పక్కగా జరగాలని, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కె. జండగే కోరారు. శుక్రవారం రోజున భువనగిరి పట్టణంలోని వెన్నెల కళాశాలలో ఏర్పాటు చేసిన డియస్సీ-2024 లో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతున్న తీరును కలెక్టర్ సందర్శించి, పరిశీలించారు. 473 మంది అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.