ఎఐటీయూసీ పోరాటాల ఫలితంగా సివిల్ సప్లయి కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల కూలి రేట్లు పెరిగాయని ఎఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు. శుక్రవారం రోజున హమాలీ కార్మికులకు కూలి రేట్లు పెరిగిన సందర్భంగా సివిల్ సప్లయి గోడౌన్ వద్ద హమాలీలు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. హమాలీ కార్మిక సంఘాల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించటంతో చర్చలు సఫలం అయ్యాయని ఇమ్రాన్ తెలిపారు.