రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన మహంకాళి శివ(15) గత కొద్ది రోజులుగా తనకు స్మార్ట్ ఫోన్ కావాలని తల్లి తండ్రులను అడగగా సోమవారం పెద్ద గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన శివ మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.