హరి, హర క్షేత్రమైన యాదాద్రిలో సంప్రదాయ క్రతువులతో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం మొదలయ్యాయి. విజయ దశమి ముందస్తుగా శ్రీ దేవీమాతను కొలుస్తూ, తొమ్మిది రోజుల పాటు వివిధ ఆరాధనలను నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల ఆదిపూజను వినాయకుడికి నిర్వహించారు. పూజా జలంతో ఆలయ పరిసరాల్లో శుద్ధి చేసి, ఉత్సవ నిర్వహణకు మార్గం సుగమం చేశారు.