సోలార్ ప్యానెళ్లను అమర్చుకునేందుకు ఒక్కో కుటుంబానికి 75,000 నుంచి 80,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దీంతో జీరో కరెంటు బిల్లు వస్తుందన్నారు. గృహావసరాలకు వినియోగించుకునేందుకు మిగిలిన విద్యుత్ ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. జార్ఖండ్‌ను కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎం ఎన్నో ఏళ్లుగా పాలించినా పేదరికాన్ని, వలసలను, నిరుద్యోగాన్ని తగ్గించలేదని విమర్శించారు.