AP: 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 9వ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో మంత్రి లోకేష్ ప్రసంగించారు. 2014-2019 టీడీపీ హయాంలో సుమారు 150 కంపెనీలు, 50 వేల మందికి ఉపాధి కల్పించామని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని ఎద్దేవా చేశారు. ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తే.. వాటిలో కూడా వాటాలు అడిగే పరిస్థితికి వైసీపీ దిగజారిందని విమర్శలు చేశారు.