హన్మకొండ: బంధన్ హాస్పిటల్ పై డీఎంహెచ్ఓ కు ఫిర్యాదు
హన్మకొండ బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై జర్నలిస్టు కృష్ణ హన్మకొండ డీఎంహెచ్ఓ అప్పయ్యకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ జర్నలిస్టు కృష్ణ ఇచ్చిన బంధన్ హాస్పిటల్ ఫిర్యాదుపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విచారణలో హాస్పటల్ యాజమాన్యం తప్పు చేసినట్టు రుజువైతే హాస్పటల్ లైసెన్స్ సైతం రద్దు చేస్తామని పేర్కొన్నారు.