వరంగల్ జిల్లా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి సమావేశమయ్యారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను మంత్రికి ఎమ్మెల్యే వివరించి, పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తూ ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.