అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య, కమిషనర్ అశ్విని లతో కలిసి వరంగల్ పశ్చిమ లోని డివిజన్లలో పలు పథకాల క్రింద కుడా, జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘం నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.