భువన్ యాప్ ద్వారా అసెస్మెంట్ ల నమోదులో వేగం పెంచాలని వరంగల్ బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ భువన్ ఆప్ ట్రేడ్ వసూళ్ల పురోగతిపై ఉన్నతాధికారులతో కమిషనర్ సమీక్షించి వేగవంతంగా పూర్తి చేయుటకు తగు సూచనలు చేశారు. ఇప్పటివరకు ఎంత శాతం పూర్తి చేశారని కొనసాగుతున్న విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.