హనుమకొండ జిల్లాలో ఖరీఫ్ కాలానికి సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వ్యవసాయ, డీఆర్డీఏ ఐకేపీ, పౌర సరఫరాలు, సహకార, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎలా జరుగుతుంది, అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.