హనుమకొండ కలెక్టరేట్ లో భూ వివాదాలు, అట్రాసిటీ కేసులపై నిర్వహించనున్న సమావేశానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ బృందం సోమవారం వస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపారు. కలెక్టరేట్ లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భూ వివాదాలు, అట్రాసిటీ కేసుల విచారణకు సంబంధించి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు హాజరవుతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.