ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం లక్ష్యాన్ని చేరుకోవాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు, ఇందిరా మహిళా శక్తి పథకం అమలు తీరుపై అన్ని జిల్లాల బాధ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలన్నారు.