నిరుద్యోగ యువతి, యువకుల సమస్యలపై ఉద్యోగ, ఉపాధి హక్కుల పై నిరంతరం పోరాటాలు సాగిస్తామని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) హన్మకొండ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ అన్నారు. ఆదివారం 49 ప్రగతినగర్, 31 డివిజన్ జ్యోతిరావు పూలే నగర్ లో డివైఎఫ్ఐ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా జెండాలు ఆవిష్కరించారు. ఈ మేరకు నోముల కిషోర్ మాట్లాడుతూ, డివైఎఫ్ఐ ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకై పోరాడుతుంది అన్నారు.