గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10. 30 గంటల నుంచి గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. అధికారులు సకాలంలో హాజరుకావాలని ఆదేశించారు.