గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ నెల 24న కౌన్సిల్ మీటింగ్ నిర్వహించనున్నట్లు బల్దియా కార్యదర్శి విజయలక్ష్మి శనివారం సాయంత్రం ప్రకటించారు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బల్దియా కౌన్సిల్ హాల్లో సమావేశం జరుగుతుందన్నారు. ఎజెండాలోని ఏడు అంశాలపై సమావేశంలో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. సభ్యులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని ఆమె కోరారు.