కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక విధానాలు విడనాడాలని కరిమాబాద్ సుభాష్ చంద్రబోస్ సెంటర్ వద్ద సీఐటీయూ వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు ముక్కెర రామస్వామి, ఆల్ మిల్లు వర్కర్స్ యూనియన్ శ్రీనివాస్ లు గోడ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవంబర్ 26న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుందని, ఈ సమ్మెలో కార్మికులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కే సతీష్, మట్టయ్య, మనోహర్, యాకయ్య, రత్నం, రాజు, వెంకటయ్య, బిక్షపతి, వెంకటరావు, రాఘవరెడ్డి, బాబు, తదితరులు పాల్గొన్నారు.