ఈ కార్యక్రమంలో ఆల్ షాప్ వర్కర్స్ యూనియన్ వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి లేబర్ కోడ్ అనే కొత్త చట్టాలను తీసుకొచ్చి పెద్ద సంఖ్యలో కార్మికులను బానిసలుగా బిజెపి ప్రభుత్వం మార్చే ప్రయత్నం చేస్తుంది ప్రాణ త్యాగాలు చేసి పోరాటం ద్వారా సాధించుకున్న హక్కులు ఎనిమిది గంటల పని దినాలు ఈఎస్ఐ పీఎఫ్ పని భద్రత లాంటి సౌకర్యాలను కార్మికులు సాధించుకోవడం జరిగింది మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకు వచ్చి కార్మిక చట్టాలు నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ విధానాల మూలంగా కార్మిక వర్గానికి రక్షణ లేకుండా పోతుంది కొత్త చట్టాల మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే కార్మికులు ప్రజలు కొనలేని స్థితిలో దుర్భరమైన జీవితాలు గడప వలసిన పరిస్థితి ఏర్పడింది అని అన్నారు ఒక ప్రక్కన కరుణ మహమ్మారి ఈ దేశంలో ప్రజలపై విలయతాండవం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని కార్మిక వర్గాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేయడం జరిగింది తద్వారా దేశ విదేశీ కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ దేశ ఆర్థిక భద్రతకు భంగం కలుగే ప్రమాదం ఏర్పడింది అందుకే వరంగల్ అర్బన్ జిల్లా లోని పాత బీట్ బజార్ లో అనాధ కిరాణం గుమస్తా కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఒక్క వేల రూపాయలు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం లో కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెకు యజమానులు సహకరించాలని గుమాస్తాల సంఘం నాయకులు యజమానులను కోరారు అదే విధంగా సమ్మ లో కార్మిక సోదరులు అందరూ సమ్మెలో పాల్గొంటారని యాజమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆల్ మిల్లు వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనుముల శ్రీనివాస్ పి ఆనంద్ కె మెట్టయ్య మనోహర్ యాకయ్య యాదవ్ k. శ్రీనివాస్ యాదవ్ ది కుమారు అశోక్ తదితరులు పాల్గొన్నారు.