కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా లోని వివిధ కార్మిక సంఘాల నాయకత్వంలో కిలా వరంగల్ చమన్ వద్ద సమ్మె నోటీసును ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి పుల్ల రమేష్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారం రమేష్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ముక్కెర రామస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఇనుముల శ్రీనివాస్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంగుల దయాకర్, ఏఐటిసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నర ప్రతాప్, ఏఐటిసి జిల్లా అధ్యక్షులు తోట బిక్షపతిలు పాల్గొని మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికుల రైతుల సామాన్య ప్రజల హక్కుల మీద దాడి చేస్తుందని, ఈ నెల 26న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను కార్మికులందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎనుముల శ్రీనివాసు, ఏఐసిటియు అధ్యక్షులు కొత్తపల్లి చిరంజీవి, ఏసిటి జిల్లా అధ్యక్షులు ఎండి అన్వర్, జన్ను బాబు, జన్నారం రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.