వరంగల్ లోని పాత సరోజ టాకీస్ వద్ద ఉన్న ఈ ఎస్ ఐ హాస్పిటల్ లో రోగులకు సరిపడు మందులు ఇవ్వడం లేదు. సీఐటీయూ కరిమాబాద్ ఏరియా కమిటీ కార్యదర్శి ముక్కెర రామస్వామి నాయకత్వంలో సర్వే నిర్వహించారు. డిస్పెన్సరీలో నాల్గు వేల కార్మిక కార్డులు ఉన్నాయి. సరైన మందులు లేక రోగులు హాస్పిటల్ కు రావటం లేదు. మందుల కొరతవల్ల వచ్చే కార్మిక రోగులు పూర్తిగా బంద్ అయిన పరిస్థితి ఏర్పడింది. రోజుకూ ముప్పయి మంది రోగులు మాత్రమే వస్తున్నారు అని ముక్కెర రామస్వామి అన్నారు. ఆ కొద్దిపాటి రోగులకు రోగానికి తగ్గ మందులు ఇవ్వడం లేదు. ఇలాగే కొనసాగితే హాస్పిటల్ మూతబడే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.