పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ సీపీఎం కరిమాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను స్థానిక చెట్లవారీ గడ్డలో దహనం చేశారు. ఈ సందర్భంగా కరిమాబాద్ కార్యదర్శి ముక్కెర రామస్వామి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొని ప్రతి రోజుపెట్రోల్ ధరలను పెంచుతూ సామాన్యులను మధ్య తరగతి ప్రజలపై భారాలు మోపుతుందన్నారు. ఇప్పటికే నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగడంతో ప్రజలు కొనలేని స్థితిలో ఉన్నారని మరోసారి పెట్రోల్ ధరలు పెంచడం మూలంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని రామస్వామి అన్నారు. పెంచిన ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.