ప్రజా సమస్యల పరిష్కారానికి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు.విభజన హామీలను కేంద్రం విస్మరించందని ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధనకై ఎర్రదండు లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని అయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ సిపిఐ మహా పాదయాత్ర ను విజయవంతం చేయాలని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం విభజన చట్టాలను విస్మరించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం హామీల అమలుకై ఎర్రదండలాంగు మార్చి సిపిఐ మహా పాదయాత్ర సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో
ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంశంలో పొందుపరిచిన ఉన్నటువంటి హామీలను విస్మరించిందని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ, లాంటి విభజన హామీలను ఒక్కటి నెరవేర్చలేదని అన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికై మార్చి 17 నుండి ఏప్రిల్ 17 వరకు సుమారు 30 రోజుల వరకు సిపిఐ మహా పాదయాత్రను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పాదయాత్ర మార్చి 17 బయ్యారం నుండి ప్రారంభమై ఏప్రిల్ 17న హైదరాబాదులో ముగిసి ముగింపు సభ ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 పార్లమెంటులో చట్టం చేసిందని అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావలసిన పరిశ్రమలు ఉద్యోగాలు సమగ్ర అభివృద్ధికై పాదయాత్రలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలైనా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా పై కక్షగట్టి ఇక్కడ స్థాపించవలసిన ఫ్యాక్టరీలను స్థాపించకుండా బిజెపి పాలిత రాష్ట్రాలకు తరలించిన నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం పక్షపాత వైఖరిని ప్రజా ఉద్యమాల ద్వారా ఎండగట్టాలని అన్నారు. బిజెపి ప్రభుత్వానికి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని అన్నారు. అదేవిధంగా భూపాలపల్లి బొగ్గు గనుల ప్రైవేటీకరణ, హైదరాబాద్ హనుమకొండ పారిశ్రామిక కారిడార్, పోడు రైతులకు పట్టాలు వంటి ముఖ్యమైన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు బాధ్యతను నెరవేరుస్తూ కేంద్రం నుండి రావలసిన సహాయ సహకార నిధులు, రాష్ట్రాలకు రావలసిన వాటిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరాడి సాధించాలని అన్నారు.
ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు, డబుల్ బెడ్ రూమ్, దళిత బంధు వంటి సమస్యలపై పోరాడుతున్న ప్రజలపై అణచివేత చర్యలు కాకుండా అమలు చేసే చర్యలు తీసుకోవాలని అన్నారు. యువతకు సమగ్ర యువజన విధానం రూపొందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
నిరంతరం శ్రామిక జనం పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంక్షేమ లక్ష్యంగా ఇచ్చిన హామీలను అమలుకై ప్రజలను సమీకరించి సుమారు 700 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 పెద్ద మహాసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ప్రజలందరూ ఈ పాదయాత్రకు మద్దతు తెలిపి ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధన మహా సంకల్పానికి అన్ని రకాల ఆర్థిక సహాయం సహకారాలు అందించి పాదయాత్రను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి, వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, జనగామ జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజారెడ్డి, సిపిఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి, సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు, సిపిఐ భూపాలపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు కొరిమి సుగుణ మోటపలుకు ల రమేష్, క్యాత్రాజ్ సతీష్ సోత్కు ప్రవీణ్, కుడుదుల వెంకటేష్, జోసఫ్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Where: bhupalapally
When: 9-2-2023 3:58 PM