ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను వరంగల్ ఎంజీఎం సెంటర్లలో దగ్ధం చేసారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ముక్కెర రామస్వామి పాల్గొని మాట్లాడుతూ.. ఆర్టీసి కార్మికులు వారి డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వంకు నోటీస్ ఇస్తే వాటిని పక్కన పెట్టి కక్ష పూర్వకంగా కార్మికులపై ఉక్కుపాదం మోపుతూ 48 వేల మంది కార్మికులను విధుల నుండి తొలగించడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇచ్చి ఇప్పుడు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయమని అడిగితే కార్మికులపై కక్ష తీర్చుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు.