రైతులపై దాడికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

268பார்த்தது
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీలో రైతులపై దాడిని వ్యతిరేకిస్తూ వరంగల్ అర్బన్ జిల్లాలో కరీమాబాద్ సుభాష్ చంద్రబోస్ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు ముక్కెర రామస్వామి ఇనుముల శ్రీనివాసు గారు పాల్గొని మాట్లాడుతూ ఢిల్లీలో ప్రజా సంఘాలు రైతులు సీఐటీయూ నాయకత్వం ద్వారా రైతు చట్టాలను కాపాడాలని ఢిల్లీలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడుతున్న క్రమంలో మోడీ ప్రభుత్వం పాశవికంగా కక్ష పూర్వకంగా రైతులపై పోలీసు బలగాలతో లాఠీఛార్జ్ చేసి బాష్పవాయు గోళాలు ప్రయోగించారు ఈ దాడిని సిఐటియు తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుంటూ దాడులు చేయడం హేయమైన చర్య ప్రభుత్వం రైతులకు అండగా ఉండాల్సిన రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు బడా వ్యాపారవేత్తలకు లాభాలు కట్టబెట్టడం కోసం ఈ దాడికి పూనుకున్నారు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి అన్నదాతలను నడిపించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేసింది బియ్యము గోధుమలు జొన్నలు రాగులు పప్పు దినుసులు నూనె గింజలు ఆలుగడ్డ ఉల్లిగడ్డ లాంటి నిత్యావసర సరుకుల జాబితాల నుండి తొలగించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చి పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్లకుఅడ్డగోలుగా ధరలు పెంచి అమ్ముకునే విధంగా అయితే వ్యతిరేక చట్టాలను తీసుకు రావడం జరిగింది ఇప్పటికే సరుకుల ధరలు పెరిగి మార్కెట్లో ప్రజలు కొనలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా రైతు బాధలు అర్థం చేసుకొని రైతు చట్టాలను అమలు చేస్తూ రైతులను ఆదుకోవాలని లేనిపక్షంలో ప్రజలు కర్షకులు కార్మికులు రాబోయే రోజులలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చారించారు
ఈ కార్యక్రమంలో యాకయ్య బాబు విజేందర్ సతీష్ సంతోష్ రమేష్ కుమార్ మనోహర్ కవిత రఘు బాయ్ నవీను బిక్ష పతి తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி