జనగామ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు వరప్రదాయని: ఎమ్మెల్యే
జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోమవారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. జనగామ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు వరప్రదాయని అని స్పష్టం చేసారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం దిగుబడి జనగామ జిల్లాలోనే జరుగుతుందని అది దేవాదుల ప్రాజెక్టు వల్లే సాధ్యం మైందన్నారు.