వేలేరు మండలం, గోళ్ల కిష్టం పల్లి గ్రామంలో రూ.3 కోట్ల 25 లక్షల ఖర్చుతో నిర్మించనున్న కేజీబీవీ బాలికల జూనియర్ కళాశాలను నూతన భవన నిర్మాణానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియ శ్రీహరి శుక్రవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా బోధనలోనూ, వసతులను కల్పించడంలోనూ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా కేజీబీవీ పాఠశాలలను నిర్వహిస్తుందని అన్నారు.