హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి శనివారం పరిశీలించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో, ముప్పారం, సాయి పేట, వేలేరు మండలంలోని మల్లికుదుర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు.