గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తానని, రైతులు ఎవరు అధైర్యపడవద్దని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు. పరకాల నియోజకవర్గంలో సంగెం, గీసుగొండ మండలాల పరిధిలోని భూములు కోల్పోతున్న రైతులతో పరకాల ఎమ్మెల్యే మంగళవారం సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరు అధైర్య పడవద్దని, అందరికీ న్యాయం చేస్తామన్నారు.