తొర్రూరు: ఆపదలో ఉన్న జర్నలిస్ట్ లకు ఆసరా అవుతాం
ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన తొర్రూరు కు చెందిన జర్నలిస్ట్ శేఖర్ కుటుంబానికి టీయుడబ్ల్యూజే(ఐజేయు) అండగా ఉంటుందని, జిల్లాలో ఏ జర్నలిస్ట్ కు అవసరం వచ్చినా శక్తిమేరకు ఆసరా అవుతామని శనివారం టీయుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ అన్నారు. తొర్రూరు కు చెందిన జర్నలిస్ట్ శేఖర్ కుటుంబానికి ప్రభుత్వపరంగా అందవలసిన సహాయం కోసం దరఖాస్తులను మహబూబాబాద్ డీపీఆర్వో రాజేంద్రప్రసాద్ కు అందజేసారు.