జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బొమ్మెర గ్రామంలో పోతన నివాస స్థలాన్ని బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తో పాటు పలువురు సందర్శించారు. పోతన నివాస స్థలాన్ని పర్యటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.