కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జనగామ కలెక్టర్ ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షకు దిగారు. వికలాంగుల కు వెంటనే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల నుండి పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు.