వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని మూడు తండా గ్రామ శివారు బాడువ తండాకు చెందిన భూక్య సుమన్ (21) అనే యువకుడు కుటుంబ కలహాలతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై మహేందర్ శుక్రవారం తెలిపారు. సుమన్ తన వివాహం విషయంలో తల్లి దండ్రులతో గొడవపడి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి బానోతు చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.