గోవిందరావుపేట మండలంలో ఆదివారం జరిగే యూత్
కాంగ్రెస్ సమావేశాన్ని విజయవంతం చేయాలని మండల యూత్
కాంగ్రెస్ అధ్యక్షులు చింత క్రాంతి, యూత్
కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్ కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, యూత్
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్ పాల్గొననున్నారని తెలిపారు.