గోవిందరావుపేట మండల కేంద్రంలోని పాపాయిపల్లి గ్రామంలో పోలీసులు ధరమ్సోత్ స్వాతి అనే మహిళ ఇంట్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో స్వాతి గుడుంబాను తయారు చేస్తూ విక్రయిస్తూ దొరికిపోవడం జరిగిందన్నారు. నిందితురాలు స్వాతి నుండి పది లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మత్తు పదార్థాల విక్రయానికి సంబంధించిన చట్టం ప్రకారం స్వాతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.