తాడ్వాయి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం శాంతి(పీస్) కమిటీ సమావేశం నిర్వహించినట్లు తాడ్వాయి ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా తాడ్వాయి ఎస్సై ఓంకార్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు, బక్రీద్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థల నాయకులు, మత పెద్దలు, మత గురువులు అందరితో సమావేశం నిర్వహించినట్లు, అందరూ హాజరుకావాలన్నారు.