ములుగు జిల్లా వాజేడు మండలంలో నక్సల్స్ చేతిలో మృతి చెందిన ఉయిక రమేష్, ఉయిక అర్జున్ కుటుంబాలను ములుగు జిల్లా ఎస్పీ శబరిశ్ పరామర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, ఎక్స్రేషియా త్వరితగతిన అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఇరు కుటుంబాల్లోని పిల్లల చదువు కోసం తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు. భాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు.