18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని గోవిందరావుపేట ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు గ్రామ కమిటీ అధ్యక్షులు అకినపల్లి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎంపీపీ శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడారు. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు పాత్ర చాలా కీలకమైనదని ఓటు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని తెలిపారు.