పటిష్టమైన ఓటరు జాబితాను రూపొందించాలని ఎలెక్ట్రోరల్ అబ్జర్వర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ. శ్రీధర్ అన్నారు. మంగళవారం తాడ్వాయి మండల తాహాసిల్దార్ కార్యాలయంను ఈ. శ్రీధర్ సందర్శించి, ఓటర్ల జాబిత పై ఏఈఆర్ఓ, సూపర్వైజర్లు, బిఎల్వో లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్ల జాబితా సిద్ధం చేసిన తీరును పరిశీలించారు. శ్రీధర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లను నమోదు చేయాలన్నారు.