మహబూబాబాద్ జిల్లా గూడూరు అయోధ్య పురం గ్రామాలలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన రిజిస్టర్ లను, ధాన్యం తేమ శాతంను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.