మధ్యాహ్నం భోజనం తయారీలో ప్రధానోపాధ్యాయులు తగు జాగ్రత్తలు పాటించాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అన్ని పాఠశాలల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం తయారీ చేసే ప్రదేశాలు, పిల్లలు తినే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.