ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమిరాజు కుమార్ అన్నారు. ఆదివారం భూపాలపల్లి పట్టణం కారల్ మార్క్స్ కాలనీ లొ ఇంటింటికి సిపిఐ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజిపి ప్రభుత్వనికి వ్యతిరేకంగా ఇంటింటికి కరపత్రం పంచుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలపై సిపిఐ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణంలో 30 వార్డుల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, ముఖ్యంగా ఇంటి ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో కాలనీవాసులు అనేక సమస్యలు చెబుతున్నారని మంచినీటి ఎద్దడి బాగా ఉందని తెలియజేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు గంగాసరం శీను, నాయకులు సిద్దయ్య, రాజేశ్వరి, ఆరబోయినవెంకటేష్, తోపాటు కారల్‌మార్క్స్ కాలనీ సిపిఐ నాయకులు పాల్గొన్నారు