గుడిసె వాసుల సమస్యలను పరిష్కరించాలి

3512பார்த்தது
గుడిసె వాసుల సమస్యలను పరిష్కరించాలి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీ 280 సర్వే నెంబర్లో పేదలు వేసుకున్న గుడిసెల స్థలాలకు వెంటనే ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొరిమి సుగుణ, క్యాతరాజు సతీష్, సోత్కు ప్రవీణ్, కుడుదుల వెంకటేష్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్మార్క్స్ కాలనీ గుడిసె సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గత ఐదు సంవత్సరాలు క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు. భూపాలపల్లి సింగరేణి పారిశ్రామిక ప్రాంతం కావడం వల్ల ఇక్కడ సింగరేణి, జెన్కో లాంటి సంస్థలు ఉన్నాయని, అందులో ఎంతో మంది పేదవారు పని చేసుకుని జీవిస్తున్నారని అన్నారు. చాలు చాలని జీతాలతో ఇంటి కిరాయిలు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా హామీను నెరవేర్చలేదని అన్నారు.

పేదలకు చేకూర్చవలసిన కనీస వసతులను కూడా కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. ఈ ప్రాంతంలో భూపాలపల్లి అనేకమంది పేదలు గత 15, 20 సంవత్సరాల నుండి జీవిస్తున్నారని వారు ఇండ్లు లేక మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. చేసేది ఏమీ లేక సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సర్వే నెంబర్ 280లో సుమారు 3000 మందిపై పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ చొరవ చూపి గుడిసె వాసులకు 58 జీవో ద్వారా ఇంటి స్థలాలకు పట్టాలు ఇల్లు నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పట్టాలు ఇచ్చేంతవరకు దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி