దేశంలో, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను అరికట్టాలని ఎన్ఎఫ్ఐ డబ్ల్యు భారత మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి కొరిమి సుగుణ డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో సుగుణ మాట్లాడుతూ. మహిళలపై వివక్షత చూపరాదని మహిళలు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా దూసుకుపోతున్నారని చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు. అట్లాగే ఈ మధ్యకాలంలో మహిళలపై అనేక త్యాచారాలు జరుగుతున్నాయని ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతిని తోటి మెడికల్ విద్యార్థులు వేధించడంతో ఆత్మహత్య చేసుకుందని ఇలాంటి వేధింపులు అత్యాచారాలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని విమర్శించారు. గతంలో ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగిన నిమ్మకు నీరు ఎత్తన్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. స్వతంత్ర భారత దేశంలో స్త్రీకి స్వేచ్ఛ లేదని, అడుగడుగునా మహిళలకు అవమానాలు అవాంతరాలు దాడులు జరుగుతున్నాయని మహిళలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చి దాడులు జరగకుండా అట్లాగే దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరంగా కఠిన శిక్షలు పడే అదేవిధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. అనంతరం వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను, మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, లాయర్, పోలీస్, డాక్టర్, ప్రజాప్రతినిది మహిళలు ఆకుతోట. రజిత, కలవాల. జలజ, బామాండ్లపల్లి. శిరీష, కునూరి. అక్షయ, సుధారాణి, మోట పలుకుల. సుజాత, జడల. రాజేశ్వరి, పొనగంటి. లావణ్య, వనిత, శోభా, చల్ల. మౌనిక, గాండ్ల. సౌజన్య, గోలి. లావణ్య, మమతా మరియు మహిళలు 1200మంది పాల్గొన్నారు.