ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను ఆగం చేశారు. ఏడాది కావస్తున్నా ఇచ్చిన హమీలు అమలు చేయలే. పథకాల అమలులో మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ విఫలం అయ్యిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రజావంచన దినోత్సవాల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆనాడు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామంటూ ఇంటింటికి తిరిగి సంతకాలు పెట్టి మరీ ప్రచారం చేశారన్నారు.