తక్కెళ్ళపల్లి శ్రీనివాస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని లేని పక్షంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని, ప్రభుత్వం డబల్ బెడ్ రూములు ఇవ్వడంలో విఫలం చెందిందని, 9 సంవత్సరాల నుండి ప్రభుత్వం మాటలతో సరిపెట్టిందని, జీవో నెంబర్ 58 ప్రకారం పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను సిపిఐ పార్టీ నెరవేస్తుందని కోపంతో నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ,సిపిఐ ఆధ్వర్యంలో 280 సర్వే నెంబర్ ఎర్ర చెరువులో మూడువేల గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని, వారికి గృహలక్ష్మి పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శిలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకులు పాల్గొన్నారు.