భూపాలపల్లి జిల్లా గణపురం మండల పరిధిలోని బుద్ధారం గ్రామంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డీ ఆర్ డీ ఏ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా హాజరై సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ రావు మాట్లాడుతూ గ్రామాల్లో దళారులకు దాన్యం వికరించి నష్టపోవద్దని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.