రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం కొత్తపల్లిగోరి, రేగొండ మండలాల్లోని చిన్నకోడెపాక, విజ్జయ్యపల్లి, రాజక్కపల్లి, నిజాంపల్లి, కొత్తపల్లిగోరి, సుల్తాన్ పూర్, వెంకటేశ్వర్లపల్లి, జగ్గయ్యపేట, రేగొండ, రంగయ్యపల్లి, రేపాక, రేపాకపల్లి గ్రామాలల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల ముఖ్య నేతలతో కలిసి ప్రారంభించారు.