ప్రవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలి: ఏఐఎస్ఎఫ్

346பார்த்தது
ప్రవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలి: ఏఐఎస్ఎఫ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని.. జయశంకర్ జిల్లా కలెక్టర్ కు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసఫ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలు బుక్స్ ఫీజు పేరు మీద ఒక్కొక్క విద్యార్థిపై 15 వేల నుండి 25వేల రూపాయల వరకు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు. కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలలో కనీస వసతులు లేకున్నా ఇష్టానుసారంగా వివిధ రకాల పేర్ల మీద ఫీజుల దోపిడీ చేస్తున్నారు. వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిట్నెస్ లేని స్కూల్ వ్యాన్స్, అర్హత లేని డ్రైవర్లతో స్కూల్ వ్యాన్లను నడిపిస్తున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేయాలని ఫీజుల దోపిడిని అరికట్టాలని. ఫీజు నియంత్రణ చట్టం అమలులోకి తీసుకురావాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమతిగా తరుపున కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆముదాల వైష్ణవి, రాధిక, పట్టేం రవికాంత్, జోడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி